ఉండవల్లి సెంటర్‌లో శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
గుంటూరు జిల్లా | తాడేపల్లి
ఉండవల్లి సెంటర్‌లో వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్‌లో శ్రీ గణేష్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా దివంగత వంగవీటి మోహన రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ఉత్సవ మండపాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కల్యాణం, ప్రజల సుఖసంతోషాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించారు.
అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆమెకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ యూత్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. ఉండవల్లి సెంటర్‌లో భక్తి వాతావరణం నెలకొనగా, అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు.
— SM TV MEDIA
