శ్రీవారికి భక్తురాలి భారీ విరాళం.. రెండు బంగారు పగడాల హారాలు!
శ్రీవారికి బంగారు పగడాల హారాలు విరాళం
తిరుమల,అక్టోబర్ 08: హైదరాబాద్ కు చెందిన శ్రీమతి కమల అనే భక్తురాలు గురువారం తిరుమల శ్రీవారికి దాదాపు రూ.25 లక్షలు విలువైన రెండు బంగారు పగడాల హారాలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి హారాలను అందజేశారు.
