ప్రధాని మోదీ వల్లే భారత్కు ఇంధన భద్రత: ఆస్ట్రేలియా ప్రధాని
అత్యధిక జనాభా కలిగిన భారత్కు ఇంధన భద్రత కల్పించడంలో క్రెడిట్ అంతా ప్రధాని మోదీదేనని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొనీ ఆల్బనీస్ ప్రశంసించారు.ఇంటర్నెట్ డెస్క్: అత్యధిక జనాభా కలిగిన భారత్కు ఇంధన భద్రత కల్పించడంలో క్రెడిట్ అంతా ప్రధాని మోదీదేనని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొనీ ఆల్బనీస్ ప్రశంసించారు. ఇతర దేశాలేవీ ఇంతటి బృహత్ కార్యాన్ని నిర్వహించలేదని అన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశాల సందర్భంగా న్యూయార్క్లో సెప్టెంబర్ 24న ఏషియా పాలసీ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని ఆల్బనీస్ ఈ వ్యాఖ్యలు చేశారు.

