ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లకు గుడ్న్యూస్.. రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు
ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త అందించింది. ఇకపై టెలికాం కంపెనీలు 28 రోజుల బదులు 30 రోజుల వ్యాలిడిటీ గల రీఛార్జ్ ప్లాన్లను అందించాలి. డేటా అవసరం లేని వారికి కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ సేవలు మాత్రమే అందించే ప్రత్యేక ప్లాన్లను కూడా అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. దీంతో వినియోగదారులు అనవసరంగా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సిన అవసరం తొలగి, తమ అవసరాలకు తగ్గ ప్లాన్లను ఎంచుకునే వెసులుబాటు లభిస్తుంది.
