కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలు.. సీఎం చంద్రబాబుకు ఆలయ అధికారులు ఆహ్వానం!
దసరా ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం చంద్రబాబు నాయుడిని ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఆహ్వానించారు.
క్యాంప్ కార్యాలయంలో సీఎంను కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు అమ్మవారి ప్రసాదాన్ని అందించి సీఎంకు వేదాశీర్వచనం చేశారు.
ఉత్సవాల ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్న చంద్రబాబు.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంద్రకీలాద్రి క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
ఈ కార్యక్రమంలో దుర్గగుడి ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఈఓ శీనా నాయక్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
