మైలవరంలో ‘సేవా సంకల్ప యాత్ర’కు ఘన స్వాగతం.. బైక్ రైడర్లకు టీడీపీ శ్రేణుల ఆతిథ్యం!
1 min read

మైలవరంలో ‘సేవా సంకల్ప యాత్ర’కు ఘన స్వాగతం.. బైక్ రైడర్లకు టీడీపీ శ్రేణుల ఆతిథ్యం!

📰 మైలవరంలో ‘సేవా సంకల్ప యాత్ర’కు ఘన స్వాగతం

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ‘సేవా సంకల్ప యాత్ర’కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని టీడీపీ విద్యార్థి విభాగం టీఎన్‌ఎస్‌ఎఫ్‌, తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతి నుంచి వారణాసి వరకు బైక్‌ యాత్ర చేపట్టారు.

అలిపిరి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ మీదుగా సుమారు ఎనిమిది రోజుల పాటు కొనసాగనుంది. అక్టోబర్‌ 8న వారణాసికి చేరుకోనున్న యాత్రలో 25 మంది బైక్‌ రైడర్లు పాల్గొంటున్నారు.

యాత్రలో భాగంగా మార్గమధ్యంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించడంతో పాటు పవిత్ర నదుల నుంచి జలాలను సేకరించి కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు సూచనల మేరకు స్థానిక టీడీపీ నాయకులు యాత్ర బృందానికి ఆతిథ్యం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *