బిగ్‌బాస్ 10లో సరికొత్త ట్విస్టులు.. ప్రేక్షకుల్లో ఆసక్తి!🚨
1 min read

బిగ్‌బాస్ 10లో సరికొత్త ట్విస్టులు.. ప్రేక్షకుల్లో ఆసక్తి!🚨

బిగ్ బాస్ తెలుగు 10

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10పై సర్వత్రా ఆసక్తినెలకొంటోంది. ఇప్పటికే తొమ్మిది సీజన్స్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు సీజన్ 10లోకి అడుగుపెట్టింది. త్వరలోనే బిగ్ బాస్ 10ప్రారంభంకానుంది. అయితే ఈ సారి బిగ్ బాస్వ 10 సీజన్‌ గత సిజన్‌కంటే భిన్నంగా ఉండనుంది. గత కొన్ని రోజుల నుంచి బీబీ సీజన్ 10కి సంబంధించిన సన్నాహాలను స్టార్ మా నిర్వాహకులు మొదలు పెట్టి రసవత్తరంగా కొనసాగిస్తున్నారు. సీజన్ 10కు కూడా అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 1కి జూనియర్ ఎన్టీఆర్, సీజన్ 2కి నాని హోస్ట్‌గా వ్యవహరించారు. సీజన్ 3 నుంచి సీజన్ 9 వరకు హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున.. ఈ సీజన్‌కు కూడా ఆయనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.ఇప్పటి వరకు వచ్చిన సీజన్స్ కు భిన్నంగా ఈ సీజన్ 10 ఉండేలా ప్లాన్ చేశారు మేకర్స్. దీంతో బీబీ సీజన్ 10పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటోంది. సీజన్ 10లో కొత్త నిబంధనలు, కొత్త గేమ్స్‌తో మరింత ఆసక్తికరంగా.. వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేసినట్టు స్టార్ మా వర్గాలు చెబుతున్నాయి.  ఇప్పటివరకు అన్ని సీజన్లు టీఆర్పీ దుమ్మురేపాయి. అలాగే సీజన్ 9 కూడా మంచి టీఆర్పీ దక్కించుకుంది. దీంతో బీబీ సీజన్ 10పై కూడా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి బిగ్ బాస్ 10 దశావతారం ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *