ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే రోషన్ కుమార్
చింతలపూడిలో ఉచిత వైద్య శిబిరం.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే రోషన్ కుమార్
ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చింతలపూడి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరలో పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చింతం విష్ణు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రసూల్, అభివృద్ధి కమిటీ సభ్యులు కంభం రమేష్, గుమ్మిశెట్టి భారతి, మాజీ సర్పంచ్ చిట్లూరి ధర్మరాజు తదితర కూటమి నేతలు పాల్గొన్నారు.
