రాష్ట్ర స్థాయి స్వచ్ఛ అవార్డు.. జయలక్ష్మికి ఘన సన్మానం
స్వచ్ఛ అంబాసిడర్ జయలక్ష్మికి విక్కుర్తి ఘన సత్కారం
అవనిగడ్డ నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి స్వచ్ఛ అవార్డు అందుకున్న చల్లపల్లి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలు జయలక్ష్మిని టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. ఇటీవల విజయవాడలో జరిగిన స్వచ్ఛ అవార్డుల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జయలక్ష్మి అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా విక్కుర్తి ఆమెను దుశ్శాలువాతో సత్కరించి, చీరను బహూకరించారు. సీఎం చంద్రబాబు తనను వేదికపై ప్రత్యేకంగా గౌరవించడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని జయలక్ష్మి తెలిపారు.
